దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అత్యవసరంగా అవసరమయ్యే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, ప్రతిరోజూ మందులు వాడేవారు తమకు కావలసిన ఔషధాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. బంద్ కారణంగా సాధారణ మందులు కూడా లభించకపోవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ విభాగం హెచ్చరించింది.









