నిమ్మనపల్లె సమీపంలో బుధవారం ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు. బుగ్గకాలువకు చెందిన రెడ్డమ్మ కుటుంబ సభ్యులతో కలిసి మామిడి తోట వద్దకు వెళ్లి, కాయలు కోసి ట్రాక్టర్లో ఇంటికి పంపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మదనపల్లెకు వస్తుండగా పిట్టావాండ్లపల్లి సమీపంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.










