కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీర శ్యాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ సాంకేతిక రంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులను, సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, సిబ్బందికి కాంగ్రెస్ నాయకులు పండ్లను పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










