మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో సీబీసీ, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










