జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు సుమారు 2.43 లక్షల మంది వేతనదారులకు ఉపాధి కల్పిస్తూ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
విజయనగరం జిల్లాలో మొత్తం 1,265 ఫిష్ పాండ్ పనులు గుర్తించగా, 1,068 పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులతో గ్రామీణులకు ఉపాధి కల్పించడమే కాకుండా భూగర్భ జలాల పెంపు, చేపల పెంపకానికి అవకాశాలు పెరుగుతున్నాయి.
#Boiena Rajesh








