పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం.|

0
0

మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.