దేశవ్యాప్తంగా ఇప్పుడు “డీలిమిటేషన్” అంశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. జనాభా ఆధారంగా పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన పెరుగుతోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు population control విజయవంతంగా అమలు చేసినప్పటికీ, ఇప్పుడు అదే రాజకీయంగా disadvantage అవుతుందా అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రత్యర్థి నేతలు కూడా ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. North vs South political imbalance వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.








