పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి

0
4

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి. ఏడాది నుంచి మూడేళ్ల వయసున్న పొట్టేళ్లను రైతులు తీసుకురావడంతో సంతంతా వాటితో నిండిపోయింది.

బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ కోసం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పొట్టేళ్లకు మంచి గిరాకీ ఏర్పడటంతో, ధరలు 35వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పొట్టేళ్లకు అధిక ధర లభిస్తోంది# కొత్తూరు మురళి.