అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పుంగనూరు నుంచి ఇంటికి వెళ్తున్న సుబ్రహ్మణ్యం, వినయ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని.
తిరుపతి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, వినయ్ స్వల్పంగా గాయపడ్డాడు. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .










