గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: డీసీపీ భాస్కర్
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ సెంటర్ను డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ప్రకాష్ సందర్శించారు. మత్తుకు బానిసలైన వారికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి, కోర్టు ఆదేశాలతో 15 రోజులు ఇక్కడ చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మంచిర్యాల జోన్లో ఇప్పటివరకు 19 మందిని ఈ కేంద్రానికి తరలించామన్నారు.
గంజాయి విక్రేతలు, వినియోగదారుల సమాచారాన్ని ప్రజలు వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. చికిత్స తర్వాత కూడా మారకుంటే జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని డీసీపీ పిలుపునిచ్చారు.









