మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.

0
4

శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు (35) పాలెంకొండకు హైవేపై నడుచుకుంటూ వెళుతుండగా సీటీఎంచెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషాదకర ఘటన శుక్రవారం వేకువజామున వెలుగుచూసింది. తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.