కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా,మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాదరావు ఈ రోజు కాగజ్నగర్ X రోడ్డు వద్ద సభాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం సభా ఏర్పాట్లు, భద్రత.
మరియు ప్రజల రాకపోకలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్,కె హరిత గారు.జిల్లా ఎస్పీ,నితిక పంత్ గారు.వివిధ శాఖల అధికారులు, మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాదరావు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









