పేకాట స్థావరం పై దాడి….నలుగురు అరెస్ట్.

0
6

మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో దాడి చేసి, వారి వద్ద నుంచి 6 బైక్‌లు, 4 మొబైల్ ఫోన్లు, రూ. 5,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.