మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ

0
4

మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ గ్రంథం ‘మలుపు’ (కథా సంపుటి) ఆవిష్కరణ ఆదివారం జరిగింది. డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కిరణ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికలు గ్రంథ పఠనం, సాహిత్యం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ పుస్తకంలోని కథలు మానసిక విశ్లేషణలతో కూడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.