మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో శామీర్‌పేట్ ఎంఆర్ఓ (తహసీల్దార్)సుచరిత పై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
భూ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను ముందుకు జరిపేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో ట్రాప్ నిర్వహించి, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారని సమాచారం.
దాడుల అనంతరం అధికారులు తహసీల్దార్ కార్యాలయం మరియు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారని, ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం అధికారులు పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
#Sidhumaroju










