కేటీఆర్ జన్మదినం: ఆశీర్వదించిన కేసీఆర్, మొక్కల పెంపకం|

0
1

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు.

‎అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్‌తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు.

‎గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.

‎ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.