ఫిలింనగర్ క్లబ్ లో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ ప్రధానోత్సవం

0
6

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థంగా నిర్వహించిన “ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్” ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమం గురువారం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ క్లబ్ లో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులకు ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

తెలుగు సినీ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను సత్కరించడం, అలాగే ఎన్టీఆర్ సేవలను స్మరించుకోవడం లక్ష్యంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు.