🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ ప్రతినిధి జగదీష్:
మే 29, 2026 న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు, రౌట సంకెపల్లి గ్రామంలో నిర్వహించిన “కుమురం భీమ్ జల్, జంగల్, జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం” లో పాల్గొని కొమురం భీమ్, ఎడ్ల కొండుల 20 అడుగుల కాంస్య విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ మరియు ఇతర అధికారులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన, జిల్లాలో క్షయవ్యాధి (TB) నివారణకు మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.








