శనివారం రాత్రి పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో లారీ డ్రైవర్లు, మిట్ట చీమనపల్లికి చెందిన రైతు వెంకటరమణ (28) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాక్టర్ అడ్డుగా ఉందని లారీ డ్రైవర్లు రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఈ ఘటనతో ఆదివారం రైతులు మార్కెట్ యాడ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. రైతులపై జరిగిన దాడిని వారు ఖండించారు# కొత్తూరు మురళి.








