రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం గ్రామంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి టిడిపి యువ నాయకుడు ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధులు
వికలాంగులు వితంతువులు ప్రభుత్వం పై ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఇంటి వద్దకే పెన్షన్ అందించడంలో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుర్రం ఆంజనేయులు రాయచోటి మండల టిడిపి తెలుగు యువత ఉపాధ్యక్షుడు బెంగళూరు మధుబాబు కార్యకర్తలు, అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు









