కాలేశ్వరం, జూన్ 1: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు,ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “కాలేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు పవిత్రమైన అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది” అని తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, “కాలేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంన్నారు .ఈ పుష్కరాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.










