మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్

0
4

సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఇన్వాలిడేషన్ శాతం గణనీయంగా తగ్గి కేవలం 25 శాతానికే పరిమితం కావడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.మొత్తం 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవగా, 28 మంది గైర్హాజరయ్యారు.

హాజరైన 92 మందిలో 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించారు. ఒకరిని హయ్యర్ మెడికల్ బోర్డుకు పంపగా, 29 మందికి సర్ఫేస్ ఉద్యోగాల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన వారిని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగానికే (ఫిట్ ఫర్ సేమ్ జాబ్) అనుకూలంగా నిర్ణయించారు.