*ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీ*
గుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ కేంద్ర కార్యాలయం, 02/06/2026.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సర్‌పై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంతో పాటు సంస్థాగత నిర్మాణంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు.
బూత్ స్థాయి నుంచి పకడ్బందీగా ఓటరు నమోదు, సవరణ చేపట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
డూప్లికేట్, మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.
ఇంటింటి సర్వే ద్వారా కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
బూత్ కమిటీలను బలోపేతం చేసి పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయాలన్నారు.
ఓటరు జాబితానే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తుందని సీఎం అన్నారు.
ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు కూడా హాజరై సూచనలు చేశారు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
సవరణలో అధికారులకు కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని పిలుపునిచ్చారు.










