మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ ఇంచార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి స్థానిక కాలనీల్లో పాదయాత్ర చేపట్టి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది.
పాదయాత్రలో భాగంగా పలు కాలనీలను సందర్శించిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి, స్థానికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై ఆరా తీశారు. రోడ్ల పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుధ్య సమస్యలు తదితర అంశాలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తోందన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగుతాయని పార్టీ నాయకులు వెల్లడించారు.
అల్వాల్ ప్రాంతంలో నిర్వహించిన ఈ పాదయాత్ర స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
#Sidhumaroju










