మదనపల్లె రామారావు కాలనీలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఈశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలకు గాయాలయ్యాయి.
మంగళవారం రాత్రి ఓ వైన్స్‌లో మద్యం తాగుతుండగా జరిగిన ఈ గొడవలో స్నేహితులే దాడికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.









