రామసముద్రంలో విషాదం: కడుపు నొప్పితో వ్యక్తి మృతి!

0
4

రామసముద్రం మండలంలోని కనగాని గ్రామంలో అంజప్ప (37) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

గత నాలుగు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అంజప్ప, బుధవారం మధ్యాహ్నం నొప్పి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే అతను మరణించినట్లు సమాచారం. అతని ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.