పెద్దపల్లి : గోదావరిఖని గంగనారు కు చెందిన నాయిని సునీల్ కుమార్ 36 అప్పుల బాధ భరించలేక ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇటీవల సొంతగా లారీ కొన్న సునీల్ కుమార్ అది సరిగా నడవకపోవడంతో అప్పులు అయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు వన్ టౌన్ ఎస్ఐ మనోహర్ గారు బుధవారం తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మెరుగు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.









