కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు…కలుపు మొక్క..బల్మురి వెంకట్

0
0

కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు…కలుపు మొక్క.

‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు…. నాజీ గా పని చేశారు.

‎నాజీలా (నియంతలా) పదేళ్లు తెలంగాణ ప్రజలను అణిచివేసారు.

‎అందుకే ప్రజలు 2023 ఎన్నికల్లో అధికారం నుంచి దించేశారు.

‎కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా చేయడం లేదు.

‎అందుకే మీరు మీటింగ్ అన్న, ధర్నాలు అన్న ప్రజలు ఎవరు రావడం లేదు.

‎అందుకే బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది, 

‎ఆవేశంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. 

‎మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే , రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది మీరు . 

‎తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు 72 వేల కోట్లుంటే , 10 ఏళ్లలో అప్పులను 7 లక్షలకోట్ల కు తీసుకెళ్లారు . 

‎మీరు చేసిన అప్పులకు అసలు , వడ్డీ కలిపి నెలకు 6 వేల కోట్లు మేము బ్యాంకులకు వడ్డీ కడుతున్నాము . 

‎మీరు చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లని పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు .

‎ ‎ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే 1 లక్ష కోట్లు అప్పులు తెచ్చారు . 

‎ఈ అప్పు ఏ విధంగా తీరుస్తారని బ్యాంకులు అడిగితే , కాళేశ్వరం నీళ్లు అమ్మి తీరుస్తామని చెప్పి అప్పు తెచ్చిన ఘనులు మీరు . 

‎కూలిపోయి చుక్క నీరు రాని కాళేశ్వరం నీళ్లు ఏ విధంగా అమ్మి అప్పు తీర్చాలో కేటీఆర్ సమాధానం చెప్పాలి . 

‎కాలం చెల్లిన టెక్నాలజీ తో మీరు కట్టిన యాదాద్రి , భద్రాద్రి ధర్మల్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగి పోయి రాష్ట్రానికి గుదిబండలుగా మారాయి .

‎ అదీకాక , బొగ్గుగనులున్న ప్రాంతానికి దూరంగా ధర్మల్ స్టేషన్స్ కట్టడంతో , బొగ్గు రవాణా ఖర్చు తడిసి మోపెడవుతున్నది .

‎ బాధ్యతలేని, చేతగాని పాలన సాగించారు . 

‎ప్రజల సొమ్ముకాబట్టి ఇష్టానుసారం ఖర్చుపెట్టి దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు అవి ప్రజల నెత్తిన గుదిబండలుగా మారిపోయాయి . లక్ష కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం రెండేళ్లలో కూలిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నది .

‎ దీనికి సిగ్గుపడాల్సింది పోయి , గొప్ప ఘనకార్యం చేసినట్లు కాళేశ్వరం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారు .

‎పార్టీ వర్కింగ్ పెసిడెంట్ పదవి నీకు ఇస్తే , అప్పుడు వర్కింగ్ ముఖ్యమంత్రిగా , ఇప్పుడు వర్కింగ్ ప్రతిపక్షనాయకుడిగా చలామణి అవుతున్నావు . 

‎త్రీ ట్రిలియన్ లో ఎన్ని సున్నాలున్నాయో రేవంత్ రెడ్డి కి తెలియదంటున్నారు . 

‎అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్న లేచింది మొదలు కుంభకోణాలు చేసి వేల కోట్లు కొట్టి వేసిన వాడివి .

‎దోపిడీలకు పాల్పడినవాడివి . కోట్లు , మిలియన్ల , ట్రిలియన్ల లెక్కలు బాగాతెలిసిన వాడివి . 

‎ఏ లెక్కకు ఎన్ని సున్నాలున్నాయో నీకు బాగా తెలుసు . కోట్లు లెక్కపెట్టి , పెట్టి నీ చేతులు నెప్పి పుడుతుండాలి . 

‎పదేళ్లు అసమర్థ పాలన అందించిన బీఆర్ఎస్ నేతలు… ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారు.

‎అందుకే వాళ్ల మీటింగ్ లు అన్న, ధర్నాలు అన్న ప్రజలు వచ్చే పరిస్థితి లేదు.

‎ఈ విషయాన్ని స్వయంగా వాళ్ల నాయకులే బయటకు చెబుతున్నారు.

‎ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడక పోతే…. ప్రజలు ఈ యింత పదవులు కూడా ఊదగొడుతారు.

‎దమ్ముంటే…. ప్రజా సమస్యలపై చిత్త శుద్ధి ఉంటే… సభా వేదికగా చరచుకు సిద్ధం.

‎మీరంతా ప్రతిపక్ష నాయకుడితో సభకు రండి, చర్చకు సిద్ధం.