చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది. వారి వద్ద నుంచి ఏకంగా 4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.వీరంతా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు పట్టుబడిన ముగ్గురు యువకులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా గంజాయి స్మగ్లింగ్‌పై నిఘా తీవ్రం చేశాం. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు అని ఎస్,ఐ సంతోష్ ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో చింతూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
# Yadagiri










