“పెండింగ్ పనులకు వేగం పెంచండి.. ఈఈ వెంకటేష్‌ను కోరిన శాంతి శ్రీనివాస్ రెడ్డి”.|

0
0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఈఈ వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె బీహెచ్‌ఈఎల్ కాలనీ, రాజీవ్ వీకర్ సెక్షన్, బందోబస్తీ ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిలిచిపోయిన పనులను తక్షణమే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈఈ వెంకటేష్‌కు విజ్ఞప్తి చేశారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని శాంతి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేయాలని, కాలనీల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు. 

అధికారులు కూడా పెండింగ్ పనుల పూర్తి కోసం అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

#Sidhumaroju