కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.

0
0

విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె. సుబ్రహ్మణ్యం కోరారు. మదనపల్లిలో ఒకటి, రెండు తరగతుల ఉపాధ్యాయుల కోసం ప్రారంభమైన ఆరు రోజుల “జ్ఞాన ప్రకాశ్” శిక్షణా కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. భాషా, గణిత సామర్థ్యాల పెంపుదలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల నుండి ఒకరు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉందని తెలిపారు.