వరదల సమ్మర్ధతపై రేపు చింతూరు ఐటీడీఏలు సమావేశం!

0
0

వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ చర్యలు,నిర్వాసితుల పునరావాసం మొదలగు వరద ముందస్తు సన్నద్ధతపై ఈనెల 6వ తేదీన (శనివారం) చింతూరులో సమావేశం జరగబోతోంది. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరదలు వస్తే ఎలా తట్టుకోవాలి?

ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ముంపు వస్తే ప్రజలను ఎలా కాపాడాలి? సహాయక చర్యలు ఎలా ఉండాలి? అనే విషయాలపై అధికారులతో కలెక్టర్చ ర్చించనున్నారు. చింతూరు ఐటీడీఏ (ITDA) సమావేశ మందిరంలో ఈ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. అయితే ఈ మీటింగ్‌కి వచ్చే అధికారులు పూర్తి స్థాయి సమాచారం, రిపోర్ట్స్‌తో రావాలని కలెక్టర్ ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

 

# Yadagiri