సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

0
0

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్, రాజుర గ్రామానికి చెందిన లోనారే సునీత అనే మహిళకు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుండి మంజూరైన ₹17,000 విలువ గల చెక్కును శుక్రవారం నాడు గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చునార్కర్ విక్రమ్, బోయినే సుబ్బారావు, మనోహర్, భావుజీ తదితరులు పాల్గొన్నారు.