శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద ముంబై- చెన్నై జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని దగ్దమయ్యాయి.
ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన సయ్యద్ అలీ (39) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.








