శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ల్యాండ్ పూలింగ్ స్థలాల్లో లేఔట్ ప్లాన్లు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అనధికార లేఔట్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.









