చింతూరు: మన లెక్కలు – మన యాప్ అవగాహన ర్యాలీ.

0
0

చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో “మన డబ్బులు – మన లెక్కలు” అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఒక భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎం సుధాకర్ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యాప్ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో సరికొత్త విప్లవం రాబోతోందని అన్నారు.

“మహిళా సంఘాల పొదుపు మొత్తాలు, తీసుకున్న రుణాలు, వాటి రీపేమెంట్స్ మరియు ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ చాలా పారదర్శకంగా, ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో చూసుకోవచ్చు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా డిజిటల్ స్క్రీన్‌పైనే అంతా క్లియర్‌గా కనిపిస్తుంది” మహిళ సంఘాల మహిళలు అందరూ ఈ యాప్ ను ఉపయోగించుకోవాలి అని పేర్కొన్నారు.

 

# Yadagiri