పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సాధ్యమైనంత మెరు మొక్కలు ను నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలని లక్షట్ పేట్ అదునపు సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.
శుక్రవారం లక్షట్ పేట్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ తో కలిసి మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ, పి సంతోష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరావు, అడిషనల్ పి పి రవీందర్రావు, ఏజీపీ సంతోష్, డిఆర్ఓలు సాగరిక, సునీత, గోపికృష్ణ, FSO . అల్తాఫ్ హస్సేన్, శ్రీలత, ఎఫ్ బి ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు..









