మెగా డీఎస్సీ ఆరోపణలను ఖండించిన ఏపీ విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న అవకతవకల ఆరోపణలను ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. ప్రశ్నపత్రాల లీకేజీ, రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైసీపీ చేసిన ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా అత్యంత పారదర్శకంగా.
మెరిట్ మరియు రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే విద్యాశాఖ కమిషనరేట్‌లో నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న 34 మంది అభ్యర్థుల వివరాలను విశ్లేషించి, వారికి ఉద్యోగాలు ఎందుకు రాలేదో మీడియా సమావేశంలో అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చారు.









