కాంగ్రెస్ బీఎల్ఏ లకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ. ఎన్నికల విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లే బలమైన సైన్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
0

🎤కొమరం భీం ఆసిఫాబాద్ భారత న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషిస్తారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని వోడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించిన బీఎల్ఏల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఓటరు జాబితాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై ప్రతి బీఎల్ఏ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మోహన్, నరేష్ రాథోడ్‌లు బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఎన్నికల సంఘం నిబంధనలు, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు సవివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ అనిల్ కుమార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తరిక్, భీమ్రావు,   కార్యవర్గ సభ్యులు గాదెవేణి మల్లేష్, విజయ్, శోభన్, మరియు యూత్ కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.