🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ పిలుపునిచ్చారు. 2570వ అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ వేడుకలను ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను బుధవారం జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సెంటర్ కమిటీ, లుంబిని దీక్షా భూమి కమిటీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎండి అహ్మద్ మాట్లాడుతూ, ఈ నెల 29న జరిగే అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ అధ్యక్షుడు మసడే ప్రశాంత్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, సంతోష్, కోశాధికారి దుర్గం అనిల్, కమిటీ సభ్యులు కాట్కార్ గౌతమ్, అజిత్, రాజు తదితరులు పాల్గొన్నారు.










