నిరుపేద యువతికి అండగా నిలిచిన యువకులు: రూ. 13,500 సాయం.

0
5

అన్నమయ్య జిల్లా, పెదమండ్యం గ్రామంలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న స్థానిక యువకులు, ఆమెకు రూ. 13,500 ఆర్థిక సహాయం అందించారు.

ఎటువంటి ప్రచారం ఆశించకుండా, బాధితురాలి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గోప్యంగా ఈ సహాయం చేయడం అభినందనీయం. సహాయం చేయడం బాధ్యత అని, ప్రచారం ముఖ్యం కాదని భావించిన ఈ యువకుల తీరు గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. సేవ మార్గంగా పనిచేస్తున్న వీరి స్ఫూర్తికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.