మదనపల్లె రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 85.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. శనివారం ఆమె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. జీవో 297 ద్వారా గ్రామకంఠం భూములకు.
జీవో 306 ద్వారా పదేళ్ల అనుభవంలో ఉన్న డీకేటీ పట్టా భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు డీఐజీ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.










