మదనపల్లెలో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శనివారం మార్కెట్కు 783 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.
నాణ్యమైన మొదటి రకం టమాటాలు కిలో రూ.37 పలికాయి. రెండవ రకం కిలో రూ.35, మూడవ రకం కిలో రూ.29 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ధరల పెరుగుదల రైతులకు కొంత ఊరటనిచ్చింది.










