కేంద్ర క్రీడా శాఖ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మదనపల్లెలో ఆదివారం ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ నిర్వహించారు.
పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి మల్లికార్జున సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేసే సైకిల్ వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.










