అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు శనివారం సాయంత్రం మాట్లాడుతూ, వాహనాలు అమ్మేసినా రికార్డుల్లో పేరు మారకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయని తెలిపారు.
ఒకవేళ ఇప్పటికీ మీ పేరు మీదనే పాత బండి చూపిస్తుంటే వెంటనే సచివాలయానికి వెళ్లి మార్చుకోవాలని సూచించారు. ఆర్టీఓ రికార్డుల్లో ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ లేదా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా తల్లికి వందనం, రైస్ కార్డ్ వంటి పథకాల కోసం సచివాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.










