“శివనగర్ కాలనీ అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించాలి: ప్రజావాణిలో వినతి.|

0
45

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆల్వాల్ ఏ-బ్లాక్ 194వ డివిజన్ పరిధిలోని శివనగర్ కాలనీ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

శివనగర్ కాలనీలో పార్కు అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి మైనంపల్లి హనుమంతరావు నిధులు మంజూరు చేయించిన నేపథ్యంలో ఆయా పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా కాలనీవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనుల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి జి. కృష్ణగౌడ్, కాలనీ కార్యదర్శి వి. సత్యనారాయణ, ఏ-బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, మాజీ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఎం.కె. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal