రైతుల పంట నష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు
రైతులకు పంటల బీమా అమలు చేయాలి.. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి!
జూలూరుపాడు: బిజెపి ముఖ్య నాయకుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏలినా ప్రభావం వల్ల రైతుల పంటలు ఎండిపోతున్నవి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రోజుకి నాలుగు ఐదు కరెంట్ కూడా వ్యవసాయానికి ఇది అందట్లేదు, ఎలీనా ప్రభావం ఉందని సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలిసినా కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు పంటలు దెబ్బతింటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నీళ్లు ఉండి పవర్ ప్లాంట్ బొగ్గు గనులు మన దగ్గరే ఉండి ముగ్గురు మంత్రులు ఉండి ఈ జిల్లాల కరెంటు కోతలు ఉన్నాయంటే సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవటం వల్ల ఈరోజు రైతుకి పంట నష్టపరాల రావడం లేదు, దీనికి నైతిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలి రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఓటు చోరీ అని చెప్పి తిరుగుతున్నాడు తెలంగాణలో ఓటు చోరీ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. సర్ ప్రోగ్రాం ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహించినారు మీ ఉద్యోగుల మీద మీకే నమ్మకం లేదా అలాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారు. రాజకీయ పార్టీలు సార్ ప్రోగ్రాం వల్ల చనిపోయిన వారి ఓట్లు, డబల్ ఓట్లు, శాశ్వతంగా నివాసం విడిచి వెళ్లిపోయిన వారి ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి, నోటీసులు ఇచ్చింది పేర్లు తప్పులు, వయసులో తప్పులుంటే నోటీసులు ఇచ్చారు, ఏ పోలింగ్ బూత్ లో ఓట్లు పోయినావు తీసుకొని మీ పోలింగ్ బూత్ లో ఆఫీసర్ కి తెలియజేయండి, వారు ఓట్లని చేర్పిస్తారు, కానీ ఏ పోలింగ్ బూత్ లో కూడా ఓట్లు పోలేదు, రాజకీయం కోసం ఈ దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు, వారి ఆటలు ఏమి మోడీ గారు ముందు సాగవు, ఈ సంవత్సరం రైతులు తీవ్ర నష్టాలు ఉన్నారు కావున బ్యాంకుల్లో ఉన్న వ్యవసాయ రుణాలు మొత్తం కూడా మాఫీ చేయాలి. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఇస్తానని ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, వృద్ధాప్య పింఛను తాత అవ్వకు ఇద్దరికి 4000 రూపాయలు ఇస్తారని చెప్పి ఏ ఒక్క వృద్ధుడికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. వరంగల్ డెకరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి చింతనపు రామారావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నున్న రమేష్, సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరు రామారావు, సిరిపురపు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.










