పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలపై బాధితుల ఆరోపణలు.

0
4

మదనపల్లె మండలం కోళ్లబైలు కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకుల పేరు చెప్పి కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.

ఈ ఘటనపై బాధితులు 50 మందికి పైగా మదనపల్లె కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.