నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం.

0
2

లోకేశ్ రష్యా పర్యటనపై జాతీయ మీడియా ప్రత్యేక కథనం

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇటీవలే జరిపిన రష్యా పర్యటనపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF) 2026 సదస్సులో పాల్గొన్న లోకేశ్.. ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ, సెమీకండక్టర్లు, రవాణా రంగాల్లో కొత్త పెట్టుబడుల కోసం రష్యా ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.

ముఖ్యంగా తిరుపతిలో 3,000 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ‘స్పేస్ సిటీ’ ప్రాజెక్టును ఆయన అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేశారు. తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ, ఏపీ భవిష్యత్ పారిశ్రామిక వృద్ధికి ఈ పర్యటన బలమైన పునాది వేసిందని పత్రిక విశ్లేషించింది.