ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!

0
0

క్యూఆర్ కోడ్ రేషన్ విధానం: ఏపీ నమూనా దేశవ్యాప్తం

ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ (QR Code) విధానాన్ని ఇకపై దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

మిల్లింగ్ పాయింట్ నుండి లబ్ధిదారుడి వరకు ప్రతి దశను ట్రాక్ చేయడం ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. పీడీఎస్ వ్యవస్థను ఆధునికీకరించి పారదర్శకత పెంచడమే లక్ష్యమన్నారు. అలాగే, ఏపీకి గతంలో కంటే 325 శాతం అధికంగా నిధులు కేటాయించామని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.